మా గురించి !

 

ఇది మామూలు పుస్తకాల దుకాణం కాదు.ప్రతి పుస్తకాల అంగడిలో రివాజుగా ప్రదర్శించే పుస్తకాలన్నిటినీ ఇక్కడ కూడా ఎక్కించటం మా ధ్యేయం కాదు.
తెలుగు పుస్తకప్రచురణ ఇప్పుడున్న స్థితిలో రచనా వ్యాసంగం ఆర్థికంగా గిట్టుబాటుకాక ,ప్రాచుర్యం పెద్దగా లేక అవస్థ పడుతున్న ఎందరో రచయితల సమస్యకు ఒక పరిష్కారం కనుగొనాలన్న ఆలోచన ఈ ప్రయత్నానికి ప్రేరణ.
నేరుగా రచయితలనుంచి ,చిన్న పబ్లిషర్ల నుంచి పుస్తకాలను సేకరించి ప్రపంచవ్యాప్తంగా ఆన్ లైన్ లోనూ ,ఇతర విధాలుగానూ విక్రయించి,క్రమప్రకారం రచయితలకు,లేదా వారికి సంబంధించిన పబ్లిషర్లకు చెల్లించాలని మా సంకల్పం.అలాగే లాభాపేక్ష లేక సేవాభావంతో మంచి పుస్తకాలను అతితక్కువ ధరకు అందిస్తున్నా,మార్కెటింగు మీద దృష్టి పెట్టే సావకాశంలేని పబ్లిక్,ప్రైవేట్ సంస్థలకు వీలైనమేరకు ఉపయోగపడాలని మా ఆశయం.ఒక్క మాటలో చెప్పాలంటే మంచి రచయితకు తోడ్పడి,మంచి పబ్లిషర్లకు సహాయపడి మంచి తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చెయ్యలన్న ధ్యేయంతో ఏర్పరిచిన రచయితల సహకార వేదిక ఇది.

ఎన్ని వేల పుస్తకాలను నెట్లోకి ఎక్కించామన్నది కాదు..ఎన్ని మంచి పుస్తకాలకు ప్రపంచ ప్రాచుర్యం కల్పించగలిగామన్నదే మాకు ముఖ్యం.అవకాశం ఉన్న మేరకు రచయితలను,ప్రచురణకర్తలను సంప్రదించి,కలిసి వచ్చినవారికి వచ్చినట్లు ఇక్కడ స్థానంకల్పించాం.మిగతా రచయితలకూ,పబ్లిషర్లకూ ఇదే మా స్వాగతం.
ఏది పడితే అది కాకుండా పుస్తకాల ఎంపికలో కనీస ప్రమాణాలను పాటించ దలిచాం. ఉండకూడదని మీరు భావించిన పుస్తకాలేవైనా ఇక్కడ మీకు కనపడినా ,ఫలానా పుస్తకాలు ఇక్కడ ఉండదగినవని మీరు అనుకున్నా దయచేసి మాకు రాయండి.
మీరు ప్రత్యెకంగా ఎదైనా పుస్తకం కొనాలని అనుకుంటూంటే దాన్ని ఇక్కడ అమ్మకానికి పెట్టకపొయినా ,దయచేసి మాకు రాయండి ( [email protected]). మార్కెట్లో ఉన్నా లేకున్నా ఎలాగైనా దాన్ని సంపాదించి మీకు పంపడానికి ప్రయత్నిస్తాం.
ప్రధానంగా తెలుగు పుస్తకాలకోసమే దీన్ని ఉద్దేశించినా,ఇతర భాషా గ్రంథాలకు చోటు పెట్టరాదన్న నిషేధం లేదు.మంచి పుస్తకాలు ఏ భాషలో ఉన్నా ఆయా రచయితలు,పబ్లిషర్లు కోరితే ఇక్కడ పెడతాం.
 
ఇంకా చాల ఆలోచనలున్నాయి.