పిల్లల హిత కథలు (Pillala Hitha Kathalu)
Book Description
సుసంస్కారానికి,చక్కటి జీవన విధానానికి,మంచి అలవాట్లకి బీజం పడేది బాల్యంలోనే.ముఖ్యంగా ఏడు-పధ్నాలుగు ఏళ్ళ మధ్య వయసులో. నానమ్మ,అమ్మమ్మలు,తాతయ్యలు పూర్వం పిల్లలకి చిన్న చిన్న కథల ద్వారా నీతిని బోధించేవారు. ఇందులోని ప్రతీ కథ వెనక అలాంటి నీతి సందేశం దాగి ఉంది. ఈ కథలన్నీ పాఠక పిల్లల మనసుల్లోకి ఎన్నో రెట్ల వేగంగా త్వరగా,తేలిగ్గా ఇంకేలా,చక్కటి ఉదాహరణలతొ రాయబడ్డాయి. చీకట్లొ జారిపోయిన ఖరీదైన బంగారు నాణాన్ని పైసా ఖరీదు చేసే కొవ్వొత్తి వెలుగులో ఎలా వెతకచ్చో అలాగే క్లిష్టమైన విషయాలని కూడా ఈ చిన్న కథల ద్వారా తెలుసుకోవచ్చు,నేర్పించవచ్చు.మంచిని ప్రేరేపించే ఈ పాజిటివ్ కథలని తల్లితండ్రులు తమ పిల్లల చేత చదివిస్తే వారిలో మంచి బీజాలు పడే అవకాశం ఉంటుంది.
Additional Information
| Author | Malladi Venkata Krishna Murthy |
|---|---|
| Publisher | Lipi publications |
| Title | Pillala Hitha Kathalu |

